గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణంలో భాగంగా, వైరా రహదారి విస్తరణకు అధికారులు బుధవారం కసరత్తు ప్రారంభించారు. రింగ్ రోడ్ సెంటర్ నుంచి మధిర వైపు ఉన్న ఆక్రమణలను ఆర్అండ్్బ ఏఈ వసుంధర ఆధ్వర్యంలో సర్వే చేసి మార్కింగ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణ సముదాయాలు, నిర్మాణాలను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ఈ రహదారి విస్తరణతో వాహనాల రాకపోకలు సులభతరం కానున్నాయి.