సైడ్ డ్రైనేజీ కాలువను ప్రారంభించిన సర్పంచ్ మేదరి వీర ప్రతాప్

1206చూసినవారు
సైడ్ డ్రైనేజీ కాలువను ప్రారంభించిన సర్పంచ్ మేదరి వీర ప్రతాప్
ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలో రూ. 3 లక్షల ఎంపీ నిధులతో నిర్మించిన సైడ్ డ్రైనేజీ కాలువను శనివారం స్థానిక సర్పంచ్ మేదరి వీరప్రతాప్(టోనీ) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో అభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు భీమవరపు శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తోటకూరి రాంబాబు, ఇమ్మడి తిరుపతిరావు, యాకూబ్, పెద్దమ్మ భాగ్యలక్ష్మి, తాజుద్దీన్, తొగర శ్రీను, విజయ్, ఆదెర్ల అంజయ్య, కాంట్రాక్టర్ గుగులోత్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్