వైరా మున్సిపాలిటీ 8వ వార్డులో బతుకమ్మ ఘాట్ ఏర్పాటు కోసం మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ స్థలాన్ని పరిశీలించారు. వార్డు కౌన్సిలర్ చిలకా కోటయ్య, జిల్లా డాక్టర్స్ సెల్ చైర్మన్ డాక్టర్ కాపా మురళీకృష్ణ, ఇరిగేషన్ డీఈ నాగ బ్రహ్మయ్య, మున్సిపల్ ఏఈ శ్రీమాన్య, స్థానికులు పాల్గొన్నారు. ఘాట్ ఏర్పాటుకు అవసరమైన స్థలం, ఇతర సౌకర్యాలపై అధికారులు, స్థానికులతో చర్చించారు.