మున్సిపల్ ఎన్నికల నామినేషన్లలో వైరాలో ఒక వింత పరిస్థితి నెలకొంది. లాలాపురం 19వ వార్డుకు చెందిన దామా ఉమా అనే అభ్యర్థిని ఏకంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల తరపున నామినేషన్ దాఖలు చేయడం చర్చనీయాంశమైంది. జాబితాలో ఒక చోట బీఆర్ఎస్, మరోచోట కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమె పేరు నమోదైంది. దీనిపై ఆమె కుటుంబీకులు స్పందిస్తూ.. తాము టీడీపీ అభిమానులమని, ఏ పార్టీ బీ-ఫామ్ ఇచ్చినా పోటీకి సిద్ధమని తెలపడం విశేషం.