
'మహానాడు' వేదికపై ప్రసంగించిన ట్రాన్స్‌జెండర్ (వీడియో)
AP: టీడీపీ మహానాడు చరిత్రలో తొలిసారిగా ఓ ట్రాన్స్‌జెండర్‌కు వేదికపై మాట్లాడే అవకాశం కల్పించారు. టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి పీఏగా పనిచేస్తున్న వర్షిణి, మహానాడులో తన అభిప్రాయాలను పంచుకున్నారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం తమను గుర్తించి పింఛన్లు, ఇళ్లు అందించిందని, అయితే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తమను తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని ఆమె వాపోయారు. కూటమి ప్రభుత్వంలో తమ జీవితాల్లో మార్పు వచ్చిందని వర్షిణి హర్షం వ్యక్తం చేశారు.




