వైరా నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ నాయకులు లకవత్ గిరిబాబు శుక్రవారం జూలూరుపాడు మండలంలో పర్యటించారు. పాపకొల్లు రెవిన్యూ పరిధిలోని వినోబానగర్, బీనకతండ, అన్నారుపాడు, బేతాళుడు గ్రామాల్లోని రైతులు పట్టాదారు పాస్ పుస్తకాలు, యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వం యూరియా యాప్‌ను తొలగించి, పాత పద్ధతిలో షాపుల ద్వారా యూరియాను అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.