వైరా మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో, అదనపు కలెక్టర్ పిశ్రీజ డీఆర్‌సీ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్‌లను సందర్శించారు. స్థానిక ప్రభుత్వ వెటర్నరీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాల్, బ్యాలెట్ బాక్సుల స్ట్రాంగ్ రూమ్‌లను ఆమె క్షుణ్ణంగా పరిశీలించి, ఎన్నికలు సజావుగా జరిగేలా అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.