బీసీల రిజర్వేషన్లు, రైతు సమస్యలు, కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత విధానాలపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మండిపడ్డారు. మంగళవారం వైరా మండలంలోని కే. జీ. సిరిపురంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఖమ్మం జిల్లాలో సీఎం పర్యటనలకు ఖర్చయినంత డబ్బు కూడా జిల్లా అభివృద్ధికి కేటాయించలేదని ఆరోపించారు. ముగ్గురు మంత్రులు ఉన్నా అభివృద్ధి శూన్యమని, బీసీలను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి పంచాయతీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.