వైరాలోని ఆదిత్య, హరిత డెంటల్ క్లినిక్‌లతో పాటు కల్లూరులోని పలు ప్రైవేట్ ఆస్పత్రులను డీఎంహెచ్ఓ రామారావు బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతీ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యుల వివరాలు, ఆస్పత్రి రిజిస్ట్రేషన్ పత్రాలు తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించారు. అలాగే, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌ను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ఈ తనిఖీల్లో డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రదీప్, వైద్యాధికారి నవ్యకాంత్ తదితరులు పాల్గొన్నారు.