వైరా: ఆంగ్ల పరిజ్ఞానం పెరిగేలా ఈసీఆర్

4చూసినవారు
వైరా: ఆంగ్ల పరిజ్ఞానం పెరిగేలా ఈసీఆర్
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల ఆంగ్ల భాషా పరిజ్ఞానాన్ని మెరుగుపరిచేందుకు ఈసీఆర్ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. మంగళవారం వైరా మండలం పాలడుగు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఈసీఆర్ అమలును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మూడు, నాలుగో తరగతి విద్యార్థులతో ఆంగ్ల అక్షరాలు, పదాలు రాయించి, వాటి ఉచ్చారణ, అర్థాలను అడిగి తెలుసుకున్నారు. ఈసీఆర్ అమలు విద్యార్థులకు జీవితాంతం ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్