వైరా: మిగిలిన ధాన్యాన్ని తక్షణమే కోనుగోలు చేయాలి

67చూసినవారు
వైరా: మిగిలిన ధాన్యాన్ని తక్షణమే కోనుగోలు చేయాలి
వైరా మండలంలోని విప్పలమడక, సిరిపురం గ్రామాలలో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు నిరసన వ్యక్తం చేశారు. చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రులు ప్రకటించినప్పటికి అధికారులు కొనుగోలు చేయడం లేదని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు. మంగళవారం ధాన్యం రాశులు వద్ద రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. మిగిలిన ధాన్యాన్ని తక్షణమే కోనుగోలు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్