రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పంజాబ్-హరియాణా సరిహద్దులో నిరహార దీక్ష చేస్తున్న రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ కు మద్దతుగా వైరాలో తెలంగాణ రైతు సంఘం జిల్లా నేతలు శనివారం సంఘీభావం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ. రైతుల పట్ల ఇంత క్రూరత్వం ఎందుకని కేంద్రాన్ని ప్రశ్నించారు.