వైరా: చింతకాయల దొంగతనం.. ఫిర్యాదు

0చూసినవారు
వైరా మండలంలోని విప్పలమడక రైతు వేదిక ఆవరణలో జరిగిన ప్రభుత్వ చింతకాయల దొంగతనం వ్యవహారం పోలీసు స్టేషన్ కు చేరింది. ప్రభుత్వ చెట్టు కాయలను కొందరు దొంగిలించారని గ్రామ పంచాయతీ గుమస్తా మంగళవారం ఎస్సై పవన్ కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఆస్తిని దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ వింత దొంగతనంపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని గ్రామస్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్