అకాల వర్షాలకు తోడు అధికారులు నిర్లక్ష్యం మూలంగా ధాన్యం కొనుగోలు కాక రైతులు ఆందోళనకు గురవుతున్నారని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు వైరా మండలం ధాచ్చాపురం, గరికపాడు, గోల్లెన్ పాడు గ్రామాల కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని మంగళవారం రైతు సంఘం నాయకులు పరిశీలించారు. రైతులకు సకాలంలో గన్ని సంచులు సరఫరా చేయకపోవడంతో పడిగాపులు కాస్తున్నారని తెలిపారు.