జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, శుక్రవారం 99వ డివిజన్ సిద్ధార్థ నగర్ లో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా ఓట్లు అభ్యర్థించిన ఆయన, జూబ్లీహిల్స్ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని తెలిపారు. ఈ ప్రచారంలో వైరా నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.