అక్రమ ఇసుక రవాణాపై వైరా పోలీసుల ఉక్కుపాదం

4చూసినవారు
అక్రమ ఇసుక రవాణాపై వైరా పోలీసుల ఉక్కుపాదం
వైరా పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలో, ఏపీ రాష్ట్రం దొనబండ రీచ్ నుండి ప్రభుత్వ అనుమతులు, మైనింగ్ పర్మిట్లు, ట్రాన్స్‌పోర్ట్ చలానాలు, ఈ-వే బిల్లులు లేకుండా సుమారు 25 టన్నుల ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఖమ్మంకు చెందిన చల్లమల్ల వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు సుమంత్ కుమార్, లారీ డ్రైవర్ కొండేటి ఉపేందర్లను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి లారీ, మహీంద్రా థార్ కారు, టిప్పర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్