వైరా: నిబంధనలు ఎత్తివేయాలి

62చూసినవారు
వైరా: నిబంధనలు ఎత్తివేయాలి
రైతు భరోసా కోసం రైతులు దరఖాస్తు చేసు కోవాలనే నిబంధనను ప్రభుత్వం తక్షణమే ఎత్తివే యాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు. శనివారం వైరా మున్సిపాలిటీ పరిధిలోని లాలాపురంలో నిర్వహించిన రైతు సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతుల పూర్తి డేటా ప్రభుత్వం, వ్యవసాయ శాఖ వద్ద ఉండగా కొత్తగా దరఖాస్తులెందుకని ప్రశ్నించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు సంక్రాంతి మధుసూధనరావు ఉన్నారు.

సంబంధిత పోస్ట్