ఖమ్మం జిల్లా, వైరాలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి బుధవారం నివాళులర్పించారు. వైఎస్సార్ పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేసిన మహానేత అని, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞం వంటి పథకాలతో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం అని ఎమ్మెల్యే అన్నారు.