
పెండ్లి ఆరు నెలలకే నవవధువు ఆత్మహత్య
ఇల్లెందు మండలం లచ్చగూడెం గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి, ఆరు నెలల క్రితం సాఫ్ట్వేర్ ఉద్యోగి చిట్టూరి సాయికుమార్ ను వివాహం చేసుకుంది. భర్త హైదరాబాదులో పనిచేస్తుండగా, యువతి తల్లిదండ్రుల వద్ద లచ్చగూడెంలో ఉంటోంది. అత్తింట్లో కుటుంబ కలహాల కారణంగా మనోవేదనకు గురైన యువతి ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, సోమవారం తెల్లవారుజామున మరణించింది. తన కుమార్తె ఆత్మహత్యకు భర్త, అత్తమామలే కారణమని యువతి తండ్రి కమటం వెంకటేశ్వర్లు ఇల్లెందు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.




































