ఆడుకోవడానికి వెళ్లిన నాలుగేళ్ల చిన్నారి అదృశ్యం

8చూసినవారు
ఆడుకోవడానికి వెళ్లిన నాలుగేళ్ల చిన్నారి అదృశ్యం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మామిడిగూడెం పంచాయతీ సుంకరగూడెంలో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఆడుకోవడానికి వెళ్లిన నాలుగేళ్ల చిన్నారి ప్రాన్సీ అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం, గ్రామంలోని మరో ఇంటి ఆవరణలో ఉన్న సంపులో చిన్నారి మృతదేహం కనిపించింది. ప్రధాన గేటుకు తాళం వేసి ఉండటం, చిన్నారి అంత ఎత్తులో ఉన్న గేటును ఎక్కడం అసాధ్యం కావడంతో మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.