టేకులపల్లి: వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి

1543చూసినవారు
టేకులపల్లి: వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి
టేకులపల్లి మండలం స్టేషన్బోతంపూడికి చెందిన తేజావత్ టిల్లా (36) వడదెబ్బతో మంగళవారం మృతి చెందాడు. వ్యవసాయ పనులు, కూలి పనులు చేసుకునే టిల్లా, మంగళవారం మధ్యాహ్నం ఎండలో పనిచేశాక స్వగ్రామానికి వెళ్తూ రోడ్డుపై కుప్పకూలాడు. స్థానికులు 108 అంబులెన్స్లో కొత్తగూడెం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్