
ఓయో రూమ్లో మరో యువతి అనుమానాస్పద మృతి
TG: హైదరాబాద్ SR నగర్లోని ఓ ఓయో రూమ్లో దారుణం జరిగింది. ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెంది కనిపించింది. సోమవారం దుర్గ, గణేశ్ పేర్లతో యువతీ యువకులు ఓయోలో రూమ్ తీసుకున్నట్లు సమాచారం. అయితే తెల్లారేసరికి గదిలో యువతి చనిపోయి ఉంది. ఆమెతో వచ్చిన యువకుడు పరారయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల మాదాపూర్లోని ఓ ఓయో హోటల్లో ఏపీకి చెందిన యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే.




