తెలంగాణలో తగ్గనున్న ఖరీఫ్ సాగు!

4చూసినవారు
తెలంగాణలో తగ్గనున్న ఖరీఫ్ సాగు!
TG: రాష్ట్రంలో ఈ ఖరీఫ్ ​సీజన్‌లో వరి సాగు తగ్గుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎల్​నినో ప్రభావంతో రైతులు కూరగాయలు, పండ్లు, తోటల సాగుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో వరిసాగు సగానికి పైగా తగ్గుతుందని భావిస్తున్నారు. వాతావరణ శాఖ జూలై, ఆగస్టు నెలలో మధ్యంతర కరువు వస్తుందని, ఆరుతడి పంటలే వేయాలని ఆదేశించింది. గత వానాకాలంలో 131 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయగా, ఈసారి వర్షాభావ పరిస్థితులతో 30 లక్షల ఎకరాల్లో సాగు తగ్గుతుందని భావిస్తోంది. ఈసారి సాగు అయ్యే దానిలో 45లక్షల ఎకరాలు ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్