
రీకౌంటింగ్‌లో ట్విస్ట్.. 3 ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు!
TG: ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బద్యాతండాలో సర్పంచ్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో గందరగోళం నెలకొంది. మొదట కాంగ్రెస్ అభ్యర్థి ఒక ఓటు తేడాతో గెలిచినట్లు ప్రకటించగా, రెండోసారి బీఆర్ఎస్ అభ్యర్థి మూడు ఓట్ల తేడాతో గెలిచినట్లు తెలిపారు. దీంతో ఇరు పక్షాల ఆందోళనల నేపథ్యంలో అధికారులు మూడోసారి లెక్కింపు చేపట్టారు. దీంతో ఎవరు గెలుస్తారో అని పోటీదారులతో పాటు ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.




