
గుజరాత్లో నియంతృత్వ పాలన.. కేజ్రీవాల్ ఆరోపణలు
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గుజరాత్లో నియంతృత్వ పాలన కొనసాగుతోందని, రైతులను అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని ఆయన ఆరోపించారు. రాజ్కోట్ జైల్లో ఉన్న రైతులను కలిసేందుకు వెళ్లిన తనను అధికారులు అడ్డుకున్నారని, ఇది అక్కడి నియంతృత్వ పోకడకు నిదర్శనమని కేజ్రీవాల్ మండిపడ్డారు. గుజరాత్లో 88 మంది రైతులను అరెస్ట్ చేశారని, వారిలో 42 మంది బెయిల్పై బయటికి వచ్చారని, మిగతావారు ఇంకా జైల్లోనే ఉన్నారని ఆయన తెలిపారు.




