పశ్చాత్తాపంతో 40 ఏళ్ల తర్వాత లొంగిపోయిన కిల్లర్

4చూసినవారు
పశ్చాత్తాపంతో 40 ఏళ్ల తర్వాత లొంగిపోయిన కిల్లర్
కేరళలో 40 ఏళ్ల క్రితం జరిగిన హత్య కేసు, నిందితుడు స్వయంగా పోలీసులను ఆశ్రయించడంతో వెలుగులోకి వచ్చింది. 1986లో లైంగిక దాడి నుంచి తప్పించుకోవడానికి ఆత్మరక్షణ కోసం ఒక వ్యక్తిని నీటిలో ముంచి చంపినట్లు 55 ఏళ్ల మహమ్మద్ అలీ పోలీసులకు తెలిపాడు. ఈ కేసులో, 1986 డిసెంబర్‌లో కూడరంజిలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యమైనట్లు పత్రికా వార్త ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. సుదీర్ఘ పరిశోధనల అనంతరం, మృతుడు కన్నూర్ జిల్లాకు చెందిన మోహనన్‌గా గుర్తించారు. మరో హత్య కేసుపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్