మరోసారి బహిరంగంగా కనిపించిన కిమ్‌ కుమార్తె

8చూసినవారు
మరోసారి బహిరంగంగా కనిపించిన కిమ్‌ కుమార్తె
ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్ కుమార్తె కిమ్‌-జు-యే మళ్లీ బహిరంగంగా కనిపించింది. తల్లిదండ్రులతో కలిసి దేశ మాజీ నేతల స్మారక ప్రదేశం ‘కుమ్‌సుసన్‌’ స్మారకాన్ని ఆమె సందర్శించింది. గత మూడేళ్లుగా కిమ్‌తో పాటు పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న జు-యేకు భవిష్యత్తులో అధికార పగ్గాలు అప్పగించనున్నట్లు దక్షిణ కొరియా నిఘా వర్గాలు భావిస్తున్నాయి. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మాజీ నాయకులకు నివాళులు అర్పించిన ఈ కార్యక్రమానికి కిమ్‌, అతని భార్య రి సోల్ జు, కుమార్తె కిమ్‌-జు-యే, ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్