
ఆ చిత్రం నుంచి సుడిగాలి సుధీర్ ఫస్ట్‌లుక్ విడుదల
సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న 'హైలెస్సో' చిత్రం ఫస్ట్‌లుక్ విడుదలైంది. ప్రసన్నకుమార్ కోట దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శివాజీ విలన్‌గా నటిస్తున్నారు. నటాషా సింగ్, నక్ష శరణ్ హీరోయిన్లుగా, అక్షరగౌడ కీలక పాత్రలో నటిస్తున్నారు. సుజాత సిద్ధార్థ్ కెమెరామెన్‌గా, అనుదీప్ దేవ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇంటెన్స్ అండ్ డివైన్ వైబ్‌తో పోస్టర్ని డిజైన్ చేశారు.




