
గుడ్ న్యూస్.. ఒకేరోజు రెండు పథకాలు ప్రారంభించిన ప్రధాని
రైతులకు ప్రధాని నరేంద్ర మోదీ శుభవార్త చెప్పారు. రైతులకు ఎదురవుతున్న సవాళ్ల పరిష్కారంలో నూతన ఆవిష్కరణలు వస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. శనివారం న్యూఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థలో జరిగిన కార్యక్రమంలో వ్యవసాయ ఉత్పాదకత, నీటిపారుదల సౌకర్యాలు, రైతులకు రుణాల కల్పన కోసం ఎంపిక చేసిన 100 జిల్లాల్లో అమలు చేయనున్న ‘ప్రధానమంత్రి ధనధ్యాన కృషి యోజన, పప్పు ధాన్యాల స్వయం-సమృద్ధి మిషన్’ అనే రెండు పథకాలను ప్రారంభించారు.




