
ఆరోగ్యానికి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్.. వైద్యుల సూచనలు ఇవే!
ఆరోగ్యంగా ఉండటానికి వారంలో ఒక రోజు ఉపవాసం మేలు చేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. ఆయుర్వేదంలోనూ దీనికి ప్రాధాన్యత ఉంది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే రోజులో 16-20 గంటలు ఉపవాసం ఉండి, మిగిలిన 4-8 గంటల్లో ఆహారం తీసుకోవడం. దీనివల్ల శరీరం మరమ్మత్తులకు గురై, వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. బరువు తగ్గడానికి, డయాబెటిస్ నియంత్రణకు, కొలెస్ట్రాల్ తగ్గడానికి, గుండె ఆరోగ్యం మెరుగుపడటానికి, కాలేయం, కిడ్నీల పనితీరు మెరుగుపడటానికి ఇది సహాయపడుతుంది.




