కిషన్ రెడ్డి రాజీనామా చేయాలి : సీఎం రేవంత్

61చూసినవారు
కిషన్ రెడ్డి రాజీనామా చేయాలి : సీఎం రేవంత్
TG: సీఎం రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రాజెక్టులను కిషన్ రెడ్డే అడ్డుకుంటున్నారని, రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ కనుసైగ చేస్తే కిషన్ రెడ్డి డ్యాన్స్ చేస్తున్నారని, ఈటెల రాజేందర్‌‌‌కు పేరు రాకుండా మల్కాజ్ గిరిలో మెట్రో రైల్‌ను అడ్డుకున్నారని ఆరోపించారు. ప్రాజెక్టుల గురించి అడిగినా స్పందన లేదని, మోదీకి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రాజెక్టులపై ఒక్క లేఖ కూడా రాయలేదని నిలదీశారు.

సంబంధిత పోస్ట్