TG: రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. బాధ్యతగల నాయకుడు పార్టీ హామీలను సమీక్షించేవారని, కానీ రాహుల్‌కు జవాబుదారీతనం ప్రాధాన్యం కాదని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 ఉపహామీలు ఇంకా అమలు కాలేదని ఆరోపించారు. రాహుల్ గాంధీ హామీల పురోగతిని తెలుసుకోవడానికి కాకుండా, 'ఆర్‌ఆర్ ట్యాక్స్' లెక్కలు చూసుకోవడానికి, రాజ్యసభ స్థానాలను కేటాయించేందుకే తెలంగాణకు వచ్చారని విమర్శించారు.