గాలిపటం ఎగరాల్సింది ఆకాశంలో.. అమాయక ప్రాణాల్లో కాదు: సజ్జనార్

13చూసినవారు
గాలిపటం ఎగరాల్సింది ఆకాశంలోనే కానీ అమాయక ప్రాణాల్లో కాదని సీపీ సజ్జనార్ తెలిపారు. చైనీస్ మాంజా దారం తెగదు కానీ మనుషుల మెడలు, పక్షుల రెక్కలు తెగ్గోస్తుందని పేర్కొన్నారు. మీ క్షణికానందం మరొకరి ఇంట తీరని విషాదం కాకూడదని, నిషేధిత చైనీస్ మాంజా అమ్మినా, వాడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పండగని పండగలా జరుపుకోవాలని, ప్రాణాలు తీసి కాదని అధికారులు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్