
ఫిఫా WC ఫైనల్: కేరళలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు!
ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ అర్ధరాత్రి దాటి తెల్లవారుజామున ముగియనుండటంతో.. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు సోమవారం సెలవు ప్రకటించింది. ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం వెలువడింది. కేరళలో ఫుట్‌బాల్‌కు ఉన్న విపరీతమైన క్రేజ్, అభిమానుల విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పటికే షెడ్యూల్ చేసిన పరీక్షలు మాత్రం యథావిధిగా జరుగుతాయని స్పష్టం చేశారు.




