కేకేఆర్‌ బ్యాటర్ రఘువంశీకి 20 శాతం జరిమానా

5411చూసినవారు
కేకేఆర్‌ బ్యాటర్ రఘువంశీకి 20 శాతం జరిమానా
కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ బ్యాట‌ర్ అంగ్‌క్రిష్ ర‌ఘువంశీకి భారీ జరిమానా పడింది. మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానాతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ విధించారు. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్‌కు అడ్డుపడినట్లు తేలడంతో థర్డ్ అంపైర్ అతడిని ఔట్‌గా ప్రకటించారు. అనంతరం కోపంతో బౌండరీ రోప్‌ను బ్యాట్‌తో కొట్టడం, హెల్మెట్‌ను విసరడం ద్వారా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడు. దీనిని ఐపీఎల్ లెవల్-1 నేరంగా పరిగణించారు. తప్పును అంగీకరించిన రఘువంశీపై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్