
గ్లోబల్ కనెక్టివిటీ హబ్‌గా విశాఖ మారనుంది: గూగుల్ క్లౌడ్ సీఈవో
విశాఖపట్నం గ్లోబల్ కనెక్టివిటీ హబ్‌గా మారనుందని గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సీఈవో థామస్ కురియన్ ప్రకటించారు. విశాఖ నుంచి 12 దేశాలకు సబ్‌సీ కేబుల్ కనెక్టివిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అమెరికా వెలుపల ఇంత పెద్ద స్థాయిలో పెట్టుబడులు పెట్టడం ఇదే తొలిసారన్నారు. ఏపీ ప్రభుత్వంతో గూగుల్ డేటా సెంటర్ ఒప్పందం సందర్భంగా మాట్లాడుతూ, ‘‘జెమీనీ-ఏఐతో పాటు గూగుల్ సేవలన్నీ ఈ డేటా సెంటర్ ద్వారా అందుబాటులోకి వస్తాయి’’ అని వెల్లడించారు.




