ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. డేంజర్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్‌ను వదిలేసేందుకు కావ్య మారన్ సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ 15న మినీ వేలం ఉన్న నేపథ్యంలో అతన్ని వదిలేయాలని కావ్య నిర్ణయించుకున్నారట. గత సీజన్‌లో క్లాసెన్ పెద్దగా రాణించకపోవడంతో, అతన్ని వదిలేసి డబ్బులు మిగుల్చుకోవాలని హైదరాబాద్ జట్టు యాజమాన్యం భావిస్తోందని సమాచారం.