పోలాండ్‌లో కత్తితో దాడి.. ఒకరి మృతి

1430చూసినవారు
పోలాండ్‌లో కత్తితో దాడి.. ఒకరి మృతి
పోలాండ్‌లోని జారోస్లావ్‌ పట్టణంలో ఓ క్యాథలిక్ అబ్బే ప్రాంగణంలో గురువారం కత్తితో జరిగిన దాడిలో ఒక పూజారి మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. పోలీసులు 31 ఏళ్ల ఉక్రెయిన్ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు తొలుత కేఫ్‌లో పూజారిపై, ఆ తర్వాత అబ్బేలో మరో నలుగురిపై దాడి చేసినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలాండ్ అధ్యక్షుడు, ప్రధాని, అంతర్గత వ్యవహారాల మంత్రి స్పందించారు.

సంబంధిత పోస్ట్