
అక్టోబర్ 2న విజయ్ దేవరకొండ కొత్త సినిమా 'రౌడీ జనార్దన' పూజా కార్యక్రమాలు
విజయ్ దేవరకొండ వరుసగా సినిమాలు చేస్తున్నా హిట్లు రావడం లేదు. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి 'రౌడీ జనార్దన'. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ SVC బ్యానర్లో రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలను దసరా కానుకగా అక్టోబర్ 2న నిర్వహించనున్నారు. హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించనున్నట్లు సమాచారం. విలన్గా బాలీవుడ్ స్టార్ నటుడిని పరిశీలిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది.




