
వైరల్ అవుతున్నా విశ్వక్ సేన్ ప్రేమ, బ్రేకప్ కథ
యంగ్ హీరో విశ్వక్ సేన్ తన ప్రేమ, బ్రేకప్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లైలా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాను 24 ఏళ్ల వయసులో ప్రేమలో పడి, మూడున్నరేళ్ల తర్వాత బ్రేకప్ అయిందని, ఆ బాధ నుంచి బయటపడి కెరీర్ పై దృష్టి సారించానని తెలిపారు. 27 ఏళ్ల వయసులోనూ కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలున్నాయని కన్నీళ్లు పెట్టుకుంటేనే మనం దాని నుంచి త్వరగా బయటకు రాగలం అని అన్నారు.




