కోల్‌కతాలో ఫుట్‌బాల్ ప్లేయర్ మెస్సీ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఆడకపోవడంతో సాల్ట్ లేక్ స్టేడియంలో అభిమానులు విధ్వంసం సృష్టించిన నేపథ్యంలో, కోల్‌కతా పోలీసులు ఈవెంట్ ఆర్గనైజర్ సతాద్రు దత్తాను అరెస్టు చేశారు. ఆకస్మికంగా మెస్సీని స్టేడియం నుంచి తీసుకెళ్లడంతో ప్రేక్షకులు వీరంగం సృష్టించారు. ఎయిర్‌పోర్టులో సతాద్రు దత్తాను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆస్తి నష్టంపై నిర్వాహకుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయనున్నట్లు, త్వరలో FIR నమోదు చేయనున్నట్లు కోల్‌కతా పోలీసులు వెల్లడించారు.