శాంతి భద్రతల పరిరక్షణ కోసం, ఆదిలాబాద్ పట్టణంలో జరగనున్న ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగడానికి జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. డిఎస్పీ లేదా ఆ పై స్థాయి అధికారుల నుండి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ప్రజా సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమి గుడి ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించరాదని ఆయన సూచించారు. అధిక శబ్దం వచ్చే స్పీకర్లు, డీజేలు వంటి వాటికి అనుమతులు లేవని కూడా స్పష్టం చేశారు. ఈ చర్యలు ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిరోధించడానికి ఉద్దేశించబడ్డాయి.