ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం వీచిన బలమైన గాలుల కారణంగా, టీచర్స్ కాలనీలోని హనుమాన్ మందిరంలో రామనవమి సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. సాయంత్రం సమయంలో గాలి దుమారం తీవ్రమవడంతో, అన్నదాన కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన పొయ్యిలోని నిప్పురవ్వలు ఎగిసిపడి, అక్కడ ఉన్న టెంటు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలిసింది.