ఆదిలాబాద్ జిల్లాలోని కోలిపుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 'ఆరోగ్య పాఠశాల' కార్యక్రమంలో భాగంగా పోక్సో చట్టం–2012పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సఖి కేంద్రం కేస్ వర్కర్ నాగమణి, ఐసిపిఎస్ లీగల్ కమ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ కుట్ల రమేష్ ముఖ్య అతిథులుగా పాల్గొని, చిన్నారుల హక్కులు, రక్షణ, భద్రత మరియు లైంగిక వేధింపుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి, ఉపాధ్యాయులు,
విద్యార్థులు పాల్గొన్నారు.