ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో, మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముందస్తు జాగ్రత్తలు, భవిష్యత్తు కార్యాచరణపై కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. గ్రామసభల ద్వారా వెక్టర్ బోర్న్ డిసీజెస్ కంట్రోల్ ప్రోగ్రామ్‌పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.