టైర్ల ఫ్యాక్టరీలో పేలుడు: ఒకరి మృతి, పది మందికి గాయాలు

769చూసినవారు
టైర్ల ఫ్యాక్టరీలో పేలుడు: ఒకరి మృతి, పది మందికి గాయాలు
జైనథ్ మండలంలోని నిరాల గ్రామ సమీపంలో ఉన్న టైర్ల తయారీ ఫ్యాక్టరీలో శనివారం రాత్రి 11 గంటలకు ఓవర్ కంప్రెసర్ కారణంగా హీటర్ పేలింది. ఈ ఘటనలో పవన్ అనే కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో పది మంది కార్మికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఉమేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని 108 అంబులెన్స్ ద్వారా రిమ్స్ కు తరలించారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్