గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన ఇచ్చోడలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం. మహారాష్ట్ర లోని చంద్రపూర్ కు చెందిన గాయక్వాడ్ అంకుష్, భార్య జ్యోతితో ఇచ్చోడా మండలంలోని జున్ని గ్రామంలోని వారి బంధువుల ఇంటికి వస్తున్నారు. జాతీయ రహదారిపై యూటర్న్ తీసుకుంటున్న క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని జ్యోతి అక్కడికక్కడే మృతి చెందింది. భర్తకు తీవ్ర గాయాలయ్యాయి కాగా రిమ్స్ కి తరలించారు.