గుడిహత్నూర్ మండలంలోని సీతాగొంది వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని కమలాపూర్ గ్రామానికి చెందిన భౌరే నడిపి గంగాధర్ (60) ద్విచక్ర వాహనంపై ఆదిలాబాద్ వెళ్తుండగా సీతాగొంది సమీపంలో అతివేగం ఓ కార్ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గంగాధర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.