గుడిహత్నూర్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

1741చూసినవారు
గుడిహత్నూర్ మండలం మేకలగండి వద్ద జాతీయ రహదారిపై లారీ, ఐచర్ వాహనం ఢీకొన్నాయి. నిర్మల్ నుంచి మహారాష్ట్ర వైపు వెళ్తున్న ఐచర్ వాహనాన్ని వెనుక నుంచి లారీ బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐచర్‌లో ఉన్న 25 మంది ప్రయాణికుల్లో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్