ఆదిలాబాద్ రూరల్ మండలం చాంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య పాఠశాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోక్సో చట్టం, బాలికల భద్రత, లైంగిక వేధింపుల నుండి రక్షణ, ఫిర్యాదు చేసే విధానం, అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు సారా ఖాన్, ఉపాధ్యాయులు,
విద్యార్థులు పాల్గొన్నారు.